![]() |
![]() |

స్టార్ మా టీవీ లో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -950 లో.. శైలేంద్ర రెడీ అవుతుంటే దేవయాని వచ్చి ఎక్కడికి వెళ్తున్నావని అడుగుతుంది. కాలేజీకి వెళ్తున్నానని శైలేంద్ర చెప్పగానే.. ఇప్పుడు నీకేం బాగోలేదు ఎందుకు వెళ్లడమని దేవయాని అనగానే.. ఇంటి దగ్గర ఉంటే బాబాయ్ వచ్చి అలా చేశాడు. అందుకే అలా వెళ్తున్నానని శైలేంద్ర అనగానే ఆవును నిజమే అని దేవాయని అంటుంది.
ఆ తర్వాత శైలేంద్ర దగ్గరికి ధరణి వచ్చి.. మీరు ఇప్పుడు కాలేజీకి ఎందుకంటూ వెటకారంగా అడుగుతుంది. దేవయాని కోపంగా ఎందుకు నీకు వాడికి కాలేజీ లో వర్క్ ఉండదా? ఫైల్స్ మీద సైన్ చెయ్యాలి. వాడికి ఇష్టం ఉన్నది చేస్తాడు కావాలంటే పేపర్స్ కూడా చింపేస్తాడని దేవాయని అనగానే.. అ చింపేసుడేందో మామయ్య గారికి చెప్పి ఫైల్స్ ఇంటికి తెప్పిస్తాను. ఇక్కడే చింపేయండని ధరణి అంటుంది. ఏంటి ఈ మధ్య కొంచెం కూడా భయం లేకుండా మాట్లాడుతున్నావని ధరణిపై దేవయాని కోప్పడుతుంది. ఆ తర్వాత శైలేంద్ర, దేవయాని ఇద్దరు కాలేజీకి వెళ్తారు. రిషి ఎప్పుడు వస్తాడో వీళ్ళ అరాచకం ఎప్పుడు బయటపడుతుందో ఏమో అని ధరణి అనుకుంటుంది. మరొకవైపు నోటీసు బోర్డు దగ్గర వసుధార ఉండడం చూసి అనుపమ వస్తుంది. ఇంపార్టెంట్ నోటీసు అయి ఉంటుంది అందుకే చూస్తున్నావా అని అనుపమ అంటుంది. జగతి మేడమ్ ని స్ఫూర్తి గా తీసుకొని నేను ఇక్కడ వరకు వచ్చాను. ఈ ఎండీ చైర్ గురించి ఎన్ని కుట్రలు జరుగుతున్నాయి. రిషి సర్ నాపై బాధ్యతలు పెట్టి సపోర్ట్ ఇస్తు వచ్చారంటు అనుపమకి వసుధార చెప్తుంది. వసుధార డిస్సపాయింట్ అవుతుంటే అనుపమ దైర్యం చెప్తుంది.
మరొకవైపు దేవయాని, శైలేంద్ర ఇద్దరు కాలేజీ వస్తారు. అలా కాలేజీలోని ఎండీ క్యాబిన్ లోకి వెళ్తారు. క్యాబిన్ లో రెండు చైర్ లు చూసి ఏంటి రెండు ఉన్నాయని శైలేంద్ర అనగానే.. ఒకటి రిషిది అ చైర్ లో ఎవరు కూర్చొవద్దంట అని అనగానే.. ఎందుకు రిజర్వేషన్ చేయించిందా అని శైలేంద్ర అంటాడు. నువ్వు కూర్చో.. నీ ముచ్చట తీర్చుకో.. మనల్ని ఎవడ్రా ఆపేది అంటూ శైలేంద్రని కూర్చొమని దేవయాని చెప్తుంది. శైలేంద్ర కూర్చోబోతుంటే వసుధార వచ్చి ఆగమని చెప్తుంది. అ చైర్ లో కూర్చోడానికి అర్హత ఉండాలి అంటూ గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. అయిన మిమ్మల్ని ఇక్కడికి ఎవరు రానిచ్చారటూ ఫ్యూన్ ని పిలుస్తుంది. మేడపట్టి బయటకు గెంటేయ్యని ఫ్యూన్ కి వసుధార చెప్పగానే.. శైలేంద్ర దేవయానిలే అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |